ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

ఠాగూర్

శనివారం, 29 మార్చి 2025 (17:33 IST)
ఈ నెల 27వ తేదీన గ్లోబెల్ స్టార్ రామ్ చరణ్ తన 40వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెర్రీకి విషెస్ చెప్పారు. కొంతమంది సినిమా వాళ్లు ప్రత్యేకంగా రామ్ చరణ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అటు కొంతమంది అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 
 
ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను చెర్రీ సతీమణి ఉపాసన తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. "మార్చి 27వ తేదీని ఇంత ప్రత్యేకమైన రోజుగా మార్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు" అంటో ఎమోషనల్ ఎమోజీలతో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు