గీత గోవిందం టీమ్‌ని అభినందించిన రామ్ చ‌ర‌ణ్..!

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (22:55 IST)
విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక జంట‌గా ప‌ర‌శురామ్ తెర‌కెక్కించిన చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినీ ప్ర‌ముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గీత గోవిందం టీమ్‌ని అభినందించిన విష‌యం తెలిసిందే. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా గీత గోవిందం టీమ్ అభినందించారు.
 
అర్జున్‌ రెడ్డి తరువాత విజయ్‌ పర్‌ఫెక్ట్‌గా మారిపోయాడు. విజయ్‌, రష్మికల సహజ నటన ట్రీట్‌లా ఉంది. గోపీ సుంద‌ర్ మ్యూజిక్‌ చాలా బాగుంది. కథా, కథనాలు బాగున్నాయి. పరుశురామ్‌కు కంగ్రాట్స్‌. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు కంగ్రాట్స్‌ అంటూ రామ్ చ‌ర‌ణ్ త‌న స్పంద‌న‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 
 
ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఆదివారం ఈ టీమ్‌కి పార్టీ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. ఫ‌స్ట్ డేనే దాదాపు 10 కోట్లు క‌లెక్ట్ చేసిన ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో అర్జున్ రెడ్డిని క్రాస్ చేసి స‌న్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు