రామ్ గోపాల్ వర్మ ఏదో విధమైన పబ్లిసిటీతో తన సినిమా ప్రమోషన్ చేసుకుంటుంటాడు. ఆయన రూపొందించిన రెండు సినిమాలు “వ్యూహం”, “శపథం” చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఎప్పటినుంచో అదిగో ఇదిగోఅంటూ ప్రకటనలు ఇచ్చారు. ఎట్టకేలకు రెండు సినిమాలు వారం గ్యాప్ లో విడుదలవుతున్నాయి. ఏమిటి ఇలా రిలీజ్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.. ఆర్.జీ.వీకి తిక్కలేదు లెక్కలేదు అంటూ ప్రచారంతో కూడిన “వ్యూహం”, “శపథం” చిత్రాలు పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదలచేశారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ లో రిలీజ్ పోస్టర్లు కూడా వెలువడ్డాయి.