తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ సినిమా నుంచి కోసీ కోయ్యంగానే సాంగ్ లాంచ్ చేశారు. మార్క్ కె రాబిన్ ఈ పాటని రా అండ్ రస్టిక్ ఎనర్జీ వున్న పవర్ ఫుల్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ కి వరంగల్ శంకర్ రాసిన సాహిత్యం ఉర్రూతలూగించేలా వుంది. రేలా జాన్ సాంగ్ హై ఎనర్జీ తో పాడటం మరింత ఆలరించింది. ఈ సాంగ్ లో లీడ్ యాక్టర్స్ రస్టిక్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రానికి సన్నీ కూరపాటి అద్భుతమైన సినిమాటోగ్రఫీ. అనిల్ ఆలయం ఎడిటర్, లక్ష్మణ్ ఏలే ఆర్ట్ డైరెక్టర్. తారాగణం: తేజ, తన్మయి, ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్