సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్ కపూర్.. ఫోటోలు లీక్

సెల్వి

శనివారం, 27 ఏప్రియల్ 2024 (16:21 IST)
Ranbir Kapoor, Sai Pallavi
బాలీవుడ్ రామాయణం షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతోంది. దంగల్‌ను తెరకెక్కించిన దర్శకుడు నితేశ్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోంది. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. 
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. షూటింగ్ సెట్లోని రాముడైన రణ్ బీర్, సీతగా సాయిపల్లవి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఫొటోల్లో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్ కపూర్ ముస్తాబై ఉన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీత పాత్రలో సాయి పల్లవి చాలా అందంగా ఉందని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు