గోల్డెన్ డ్రెస్‌లో రాశీఖన్నా అందాల ఆరబోత, డేటింగ్‌కు సై అంటున్న వరల్డ్ ఫేమస్ లవర్ క్వీన్

గురువారం, 3 డిశెంబరు 2020 (22:04 IST)
రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంతో యువ హృదయాల్లో గిలిగింతలు రేపిన సెక్సీ హీరోయిన్. లాక్ డౌన్ విధించిన తర్వాత వరసబెట్టి ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. తాజాగా మరో ఫోటోషూట్ షేర్ చేసుకుంది.
 
బంగారువర్ణం దుస్తుల్లో ధగధగా మెరిసిపోతూ తన అందాలను ఆరబోస్తూ ఫోటోలను దిగింది. ఈ ఫోటోలను షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ. ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఈ తార మరికొన్ని ప్రాజెక్టుల్లో సైన్ చేసిది. 
గత సోమవారం తన 30వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న రాశీ ఖన్నా తను లవ్‌లో ఫెయిల్యూర్ అనే విషయాన్ని బయటపెట్టింది. లవ్ ఫెయిల్ అయితే ఎంత బాధగా వుంటుందో అది తను అనుభవించినట్లు తెలిపింది. అంతేకాదు... ప్రస్తుతం తను డేటింగ్ చేయాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఆమె మాటలను చూస్తుంటే త్వరలోనే ఎవరితోనైనా ప్రేమలో పడుతుందేమోనన్న అనుమానం కలుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు