టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇటు తెలుగు, తమిళం భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఫలింగా ఆమె నేషనల్ క్రష్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయారు. సల్మాన్ ఖాన్ నటించిన "సికిందర్" చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అలాగే, ఇటీవల సంచలన విజయం సాధించిన "ఛావా" సినిమాలో హీరోయిన్ పాత్రను పోషించారు. అదేసమయంలో తన పారితోషికాన్ని కూడా రెట్టింపు చేశారు. ఇపుడు ఒక్కో చిత్రానికి రూ.10 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది.
అదేసమయంలో ఆమె తన ఆస్తులను కూడా పెంచుకున్నట్టు సమాచారం. అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితా అంచనాల ప్రకారం రష్మిక ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.66 కోట్లుగా ఉందని, ఇది అతి త్వరలోనే రూ.100 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. ఈ బ్యూటీకి బెంగుళూరు, కూర్గ్, హైదరాబాద్, గోవా, ముంబైలలో సొంత నివాసాలు ఉన్న విషయం తెల్సిందే.