నేషనల్ క్రష్ రశ్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తోంది. తన అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రశ్మిక. వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రశ్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి.