రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

ఠాగూర్

సోమవారం, 24 మార్చి 2025 (11:13 IST)
కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "సికిందర్". సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నాలు ప్రధాన పాత్రలను పోషించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్ ట్రైలర్‌ రిలీజ్ వేడుక తాజాగా నిర్వహించింది. ఈ వేడుకల హీరో, హీరోయిన్ల వయసు వ్యత్యాసం గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దీనిపై సల్మాన్ ఖాన్ తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. ఆ విషయంలో హీరోయిన్ రష్మికకు లేని ఇబ్బంది, బాధ, నొప్పి మీకెందుకయ్యా అంటూ చురక అంటించారు. 
 
తనకు హీరోయిన్‌కు మధ్య దాదాపు 31 యేళ్ళ వయసు తేడా ఉందని కొందరు అంటున్నారని సల్మాన్ అన్నారు. హీరోయిన్‌కు గానీ, ఆమె తండ్రికిగానీ లేని సమ్య మీకెందుకని ప్రశ్నించారు. రష్మికకు పెళ్ళయి పాప పుడితే ఆమెతో కూడా బిగ్ స్టార్ అవుతుందని ఆయన గుర్తుచేశారు. అపుడు కూడా కలిసి నటిస్తామని, తల్లిగా రష్మిక అనుమతి తప్పనిసరిగా తీసుకుంటానని సల్మాన్ వ్యాఖ్యానించారు. 
 

హీరోయిన్‌కు లేని ఇబ్బంది మీకెందుకయ్యా.... pic.twitter.com/WldlPmfMjs

— Webdunia Telugu (@WebduniaTelugu) March 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు