రవితేజ పాన్ ఇండియన్ ఫిల్మ్ - టైగర్ నాగేశ్వర రావు

బుధవారం, 3 నవంబరు 2021 (14:23 IST)
Tiger Nageswara Rao poster
రవితేజ మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేశారు.  తాజాగా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైగర్ నాగేశ్వర రావు పేరుతో రాబోతోన్న ఈ  సినిమా 1970 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. స్టువర్ట్ పురంలోని గజ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ రోల్‌ను పోషించేందుకు రవితేజ పూర్తిగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో రవితేజ ఆకట్టుకోబోతోన్నారు.
 
గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వంశీ ఈ కథకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. తేజ్ అగర్వాల్ నారాయణ్ సమర్ఫణలో అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ కథ మీదున్న నమ్మకంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్‌లో నిర్మించేందుకు నిర్మాతలు సిద్దమయ్యారు. రవితేజకు ఇదే మొదటి పాన్ ఇండియన్ సినిమా. తెలుగు,తమిళ, కన్నడ మళయాల హిందీ భాషల్లో ఈ చిత్రం విడుద‌ల‌కానుంది.
 
టైగర్ నాగేశ్వర రావు కథ సినిమాటిక్‌గా ఉంటుంది. ఇక అలాంటి పాత్రలను పోషించడంలో రవితేజ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు. సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ దొంగ జీవిత చరిత్రగా రాబోతోన్న ఈ సినిమాకు ఇది పర్ ఫెక్ట్ టైటిల్.
 
ఇక టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే.. అందులో పులి అడుగుల్లా కనిపిస్తున్నాయి. టైగర్ నాగేశ్వరరావు అడుగులే అలా కనిపిస్తుండటం, అతని పిక్క బలాన్ని చూపించేశారు మేకర్స్. దీన్ని బట్టి రవితేజ మేకోవర్ కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో ట్రైన్‌తో పోటీపడి పరిగెత్తుతున్నట్టు కనిపిస్తోంది. వేటకు ముందే నిశ్శబ్దాన్ని ఫీల్ అవ్వండి అంటూ టైటిల్ పోస్టర్ మీద రాసి ఉంది.
 
ఈ సినిమాకు మంచి స్క్రిప్ట్ రెడీ అయింది. ఇందులో హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఉండోబోతోన్నాయి. ఈ కథ 70వ దశకంలో జర‌గ‌డం అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ఆర్ మధి కెమెరామెన్‌గా ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా మాటల రచయితగా, మయాంక్ సింఘానియ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు