హీరో తన ప్రేయసి ఉద్దేశించి పాడుకున్న ఈ పాట కాలేజీ నేపధ్యంలో క్లాస్ గా మొదలై పెప్పీ డ్యాన్స్ నెంబర్ గా టర్న్ తీసుకోవడం ఆసక్తికరంగా వుంది. వంశీధర్ గౌడ్ , వాసు వలబోజుల తెలంగాణ యాసలో పాటకు రాసిన సాహిత్యం క్యాచిగా వుంది.
నా గుండె గిలాగిలా కొట్టుకుంటాందే, నా పాణం విలావిలా మొత్తుకుంటునాదే, నీవు చూడకు జర నవ్వుకు నన్ను ఆగం చెయ్యకే ♫
జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రం రైటింగ్ విభాగంలో వున్నారు. ఈ చిత్రానికి కథ అందించిన అనుదీప్, వంశీధర్ గౌడ్, కళ్యాణ్ లతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రానికి డైలాగ్స్‌ను అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్ రాశారు.
వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా
సాంకేతిక విభాగం- సమర్పణ: ఏడిద శ్రీరామ్, కథ: అనుదీప్ కెవి, నిర్మాత: శ్రీజ ఏడిద, దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి, స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్, డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, సంగీతం: రాధన్, డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి, ఎడిటర్: మాధవ్