పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న నటి రేణు దేశాయ్.. ఆయనతో విడాకులు తీసుకున్నారు. తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్ - ఆద్యలతో కలిసి జీవిస్తున్నారు. బద్రి, జానీ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన రేణు దేశాయ్ నటనకు దూరం అయ్యింది. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.