ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సంతోష్ శోభన్ `పేపర్ బాయ్` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఇప్పడు ఏక్ మినికథ చిత్రంలో చాలా ఢిఫరెంట్ కథతో ప్రేక్షకుడ్ని నవ్విండానికి సిధ్ధమయ్యాడనే విషయం టీజర్ చూసిన అందరికి అర్ధం అవుతుంది. `ఎక్స్‌ప్రేస్ రాజా` చిత్రంతో యు వి క్రియేషన్స్ బ్యానర్లో సక్సస్ ని సాధించిన రచయిత, దర్శకుడు మేర్లపాక గాంధి ఈ చిత్రానికి కథని అందించారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.