నేను మోనార్క్ లాంటివాడినని, 'వంగవీటి' సినిమా విషయంలో ఎవరు చెప్పినా విననంటూ రచ్చ చేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వెనక్కి తగ్గారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసిన ‘వంగవీటి’ సినిమాలో ఒక డైలాగ్‌ను తీసేయడానికి ఒప్పుకున్నారు.
ఏపీ డీజీపీ సాంబశివరావు కోరికపై వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలున్నాయంటూ వంగవీటి రాధా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ డైరెక్టర్ వర్మతో మాట్లాడారు. దీంతో 'చంపేయ్ రంగా' అని రత్న కుమారి.. రంగాకు చెప్తున్న డైలాగ్‌ను తొలగించడానికి వర్మ అంగీకరించారు.