RIPకు అర్థం ఏమిటో తెలుసా? ఆర్జీవి ఏమంటున్నారంటే?

సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (14:08 IST)
రిప్ అనే పదానికి రామ్ గోపాల్ వర్మ కొత్త నిర్వచనం ఇచ్చారు. RIP అని చెప్పడమంటే చనిపోయిన వారిని అవమానించడమేనని వెల్లడించారు. ఎదుటి వ్యక్తి చనిపోవడం పట్ల బాధపడే వ్యక్తులు... ఒక మంచి వ్యక్తి చనిపోయాడని అనుకుంటుంటారని, ఆ ఆలోచన కరెక్ట్ కాదని వర్మ తెలిపారు. 
 
ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మరింత మంచి ప్రదేశానికి వెళ్లాడని... అందువల్ల బాధపడే బదులు సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. మరోవైపు, ఒక చెడు వ్యక్తి చనిపోతే అసలు బాధ పడాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.
 
సాధారణంగా భూమి మీద శాంతియుతంగా విశ్రాంతి తీసుకునే వ్యక్తులను సోమరిపోతులు అంటారని ఎద్దేవా చేశారు. అందుకే రిప్ అని చెప్పకుండా మంచి జీవితాన్ని గడుపుతూ ఎంజాయ్ చేయాలని చెప్పాలని సూచించారు ఆర్జీవీ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు