విజయవాడ నగరంలోఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనలు ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేయగానే సినిమాపై చాలా ఆసక్తి పెరిగింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
ఇదే అంశంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ... 'విజయవాడ రౌడీయిజంపై నా దర్శకత్వంలో రూపొందుతోన్న 'వంగవీటి' నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. అప్పట్లో అక్కడ జరిగిన చాలా సంఘర్షణలకు నేను ప్రత్యక్షసాక్షిని. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు, సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రవి శంకర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి.