హైదరాబాద్‌లో రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్: అమిత్ త్రివేది, నిఖిత గాంధీ, రఫ్తార్, డిజే యోగీల గొప్ప పెర్ఫార్మెన్స్

ఐవీఆర్

శనివారం, 25 జనవరి 2025 (18:55 IST)
‘లివింగ్ ఇట్ లార్జ్’ యొక్క స్ఫూర్తిని సంబరం చేస్తూ, సీగ్రామ్ రాయల్ స్టాగ్ హైదరాబాద్, తెలంగాణాలో బౌల్డర్ హిల్స్‌లో జనవరి 25న గొప్ప ప్రదర్శనతో రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మూడవ ఎడిషన్ యొక్క ఎంతగానో ఊహించిన ప్రారంభాన్ని సూచించింది. ఇంతకుముందు ఎడిషన్స్ యొక్క విజయాలు ఆధారంగా రూపొందించబడిన ఈ ఏడాది ఫెస్టివల్ ఉత్తమమైన మ్యూజిక్, గేమింగ్ వినోదాన్ని ఒక చోటకు తీసుకురావడం ద్వారా మరింతగా ఆధిక్యతను సంపాదించింది. భారతదేశపు అత్యంత విజయవంతులైన కళాకారుల ద్వారా పెర్ఫార్మెన్స్‌లను అనుభవించడానికి వేలాది ఔత్సాహికులు ఒక చోట చేరడంతో ఈ సాయంత్రం అనూహ్యమైన ప్రతిస్పందనను పొందింది. ఈ కార్యక్రమం  ఉత్సాహవంతమైన మ్యూజిక్ , ఉల్లాసవంతమైన పెర్ఫార్మెన్స్‌లు, సాటిలేని ఉత్సాహం యొక్క గుర్తుండిపోయే నైట్‌ను అందచేసింది.
 
బౌల్డర్ హిల్స్ విశాలమైన మైదానాలు ఆకర్షణీయమైన ఇన్స్టలేషన్స్, లీనమయ్యే కళా ప్రదర్శనలు, కూర్చబడిన ఆహారపు అనుభవాలు, ఇంటరాక్టివ్ జోన్స్‌తో ఉల్లాసకరంగా మారాయి, కేవలం మ్యూజిక్ మాత్రమే కాకుండా వివిధ రకాల సంబరాలను సృష్టించింది. ఉత్సాహవంతమైన డిజే యోగితో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఆ రోజు కార్యక్రమానికి యోగీ సరైన వాతావరణాన్ని కలగచేసారు. ర్యాప్ శైలి రఫ్తార్ వేదికపై చోటు చేసుకోవడంతో ఉత్సాహం రెట్టింపయ్యింది, తదుపరి విలక్షణమైన వోకలిస్ట్ నిఖితా గాంధీ ద్వారా అద్భుతమైన పెర్ఫార్మెన్స్  ప్రదర్శితమైంది. ఈ గ్రాండ్ ఫినాలేలో మ్యూజిక్ దిగ్గజం అమిత్ త్రివేది వైభవోపేతమైన ముగింపు చర్య ఫెస్టివల్ యొక్క విభిన్నమైన మ్యూజికల్ శైలుల యొక్క సిగ్నేచర్ మిశ్రమానికి పరిపూర్ణమైన చిహ్నంగా నిలిచింది, జనరేషన్ లార్జ్ కోసం గుర్తుండిపోయే అనుభవాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమం మున్నా భాయ్ గేమింగ్, జోకర్ కి హవేలీల మధ్య  ఉత్సాహవంతమైన EAFC ఫేస్-ఆఫ్ లైవ్‌ను కూడా వేదిక పైన ప్రదర్శించింది.
 
మ్యూజిక్ డైరెక్టర్- సింగర్ అమిత్ త్రివేది ఇలా అన్నారు, “రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజిక్ యొక్క అందమైన సంబరం- హృదయం నుండి నేరుగా, సహజంగా, ప్రామాణీకరంగా వచ్చింది. మెలొడీస్ ద్వారా కథలను భాగస్వామ్యం చేయడం, ప్రజలతో లోతైన స్థాయిలో కనక్ట్ అవడం గురించి అని నేను భావిస్తాను. ఈ ప్లాట్‌ఫాంతో భాగంగా ఉన్నందుకు నేను నిజంగా కృతజ్ఞతగా భావిస్తున్నాను. అతుల్యమైన ఉత్సాహవంతమైన ప్రేక్షకులతో కలిసి ఇక్కడ హైదరాబాద్‌లో పెర్ఫార్మెన్స్ చేయడం, ఉల్లాసోత్సాహవంతమైన అనుభవం కలిగించింది.
 
గాయని నిఖిత గాంధీ ఇలా అన్నారు, “వ్యక్తిగతంగా నాకు, రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ఎల్లప్పుడూ మ్యూజిక్ ద్వారా హద్దుల్ని అధిగమించి, ప్రయోగం చేస్తుందని భావిస్తాను. అది శైలుల కలయిక కావచ్చు లేదా ఉల్లాసకరమైన లైవ్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, మేము సృజనాత్మకమైన పరిమితులను మించి ప్రదర్శించడానికి ఈ ప్లాట్ఫాం మాకు అవకాశం ఇస్తుంది. హైదరాబాద్‌లో రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌లో పెర్ఫార్మెన్స్ చేయడం గుర్తిండిపోయే అనుభవం, ముంబయిలో నా తదుపరి షోకు నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను.”
 
ప్రముఖ హిప్-హాప్ కళాకారుడు రఫ్తార్ ఇలా అన్నారు, “ప్రభావం చూపించే బీట్స్, ఉద్వేగాలు ఎల్లప్పుడూ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌లో కీలకమైన అంశంగా ఉంటాయి. నా అభిప్రాయంలో ఇది ర్యాపింగ్‌కు మించినది- ఇది ప్రజలను ఉత్సాహవంతమైన, ఉద్వేగభరితమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. హైదరాబాద్ ఈ రోజు మ్యూజిక్ జ్వాలను తెచ్చింది. సహజమైన ఉత్సాహం, ఉత్సాహోల్లాసాలతో వేదిక దద్దరిల్లిపోయేలా చేసే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను!”
 
DJ యోగి ఇలా అన్నారు, “రాయల్ స్డాగ్ బూమ్ బాక్స్ ప్రేక్షకులు మ్యూజిక్ ద్వారా సజీవమైన అనుభూతి చెందడానికి సంబంధించినది. సంచలనం కలిగించే వాతావరణం కలిగించడానికి  బీట్స్‌ను, శైలులను మిశ్రమం చేయడమే DJగా నా లక్ష్యం. ఈ ఏడాది నా ఉత్సాహాన్ని తీసుకురావడానికి, కార్యక్రమాన్ని ఒక పెద్ద, మర్చిపోలేని పార్టీగా చేయడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను!” అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు