కొమరం భీమ్‌గా ఎన్టీఆర్.. అల్లూరిగా చెర్రీ.. రొమాన్స్ పండుతుంది..

గురువారం, 14 మార్చి 2019 (12:14 IST)
జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించిన వివరాలను గురువారం ప్రెస్ మీట్ ద్వారా రాజమౌళి వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోందని, ఇదే సినిమాలో అజయ్ దేవగన్ చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని వెల్లడించారు. 
 
ఇక అల్లూరి సీతారామరాజు విప్లవ యోధునిగా మారకముందు పాత్రను చరణ్ పోషిస్తుండగా, ఎవరికీ తెలియని కొమరం భీమ్ చిన్న వయసు పాత్రను తారక్ పోషిస్తున్నాడని రాజమౌళి వెల్లడించారు. వీరిద్దరూ ఈ సినిమాలో తన క్యారెక్టర్లలో ఒదిగిపోయారని కొనియాడిన రాజమౌళి, ఈ సినిమాను చేసే అవకాశం దక్కడం తనకు లభించిన అదృష్టమన్నారు. 
 
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితంలోని రొమాన్స్.. ఈ సినిమాలో కనిపిస్తుందని.. 1920 సంవత్సరంలో జరిగిన కథ ఇదని రాజమౌళి చెప్పారు. దాదాపు రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ కనిపించనున్నారని తెలిపారు. మరో కీలక పాత్రలో తమిళ నటుడు సముద్రఖని నటిస్తున్నారు. 2020 జూలై 30న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలతో పాటు దాదాపు 10 భారతీయ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టుగా నిర్మాత దానయ్య తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు