దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు.
అయితే ఈ మూవీలో చరణ్, ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రియ సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు.
దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ను జీ5 డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లో విడుదల చేయనున్నారు. మే 20న ఈ రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అయితే హిందీ వర్షన్‌ను ఎప్పుడు, ఎందులో విడుదల చేయనున్నారనే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ, 'ఆర్ఆర్ఆర్' మూవీ హిందీ వర్షెన్‌ను నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.