యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలితో కొత్త రికార్డులు సృష్టించిన ప్రభాస్.. సాహో సినిమాతో కూడా రికార్డులు సాధించి సంచలనం సృష్టించాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా సాహో నెలకొల్పిన రికార్డులు అందుకోడానికి మిగతా సినిమాలకు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అంతే క్షణాల్లో లక్షలాది మంది ప్రభాస్‌ను ఫాలో అయ్యారు. అలాగే ప్రభాస్ పెట్టిన మొట్ట మొదటి పోస్ట్‌తో ఇప్పుడు డార్లింగ్ వరల్డ్ రికార్డు సెట్ చేసాడని అభిమానులు అంటున్నారు. ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన మొట్టమొదటి పోస్ట్‌కు ఏకంగా 1 మిలియన్ లైక్స్ వచ్చాయని ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రికార్డుగా ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.