సాయిపల్లవికి సూపర్ ఆఫర్ ఇచ్చిన శేఖర్ కమ్ముల.. అదేంటంటే? (video)

సోమవారం, 13 జులై 2020 (21:24 IST)
''ఫిదా'' తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి రెండో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. 
 
రామోజీ ఫిలిం సిటీలో ఓ పాటను చిత్రీకరించేందుకు శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ పాటకు సాయిపల్లవినే కొరియోగ్రఫీ చేయాలని శేఖర్ కమ్ముల సూచించాడట. 
 
అందం, అభినయంతో ఇప్పటికే అదరగొడుతున్న సాయిపల్లవికి డ్యాన్స్‌లో మంచి ఆసక్తి వున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్ ఉన్న సాయిపల్లవి గతంలో కొన్ని పాటలకు నృత్యరీతులు సమకూర్చింది. ఎందుకంటే ఫిదాలో వచ్చిండే, రౌడీ బేబీ పాటల్లో ఆమె డ్యాన్సుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
 
ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల సూచన మేరకు సాయిపల్లవి పాటను కంపోజ్ చేయడమే కాకుండా స్లెప్పులు కూడా వేయనుందని టాక్. మరి ఇదే నిజమైతే సాయిపల్లవి అభిమానులకు డబుల్ ట్రీట్ సిద్ధమైనట్లే. మరో 15 రోజుల షూటింగ్ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తికానున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్‌.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు