అంతమందికి ఒకేసారి చేయగలను, సాయిపల్లవి

గురువారం, 18 జూన్ 2020 (15:55 IST)
సాయిపల్లవి మంచి నటి మాత్రమే కాదు వైద్యురాలు కూడా. వైద్యవిద్యను అభ్యసించే సమయంలో సాయిపల్లవికి సినీ అవకాశాలు వచ్చాయి. సహజ నటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఒకే ఒక్క సినిమా ఫిదాతో తనలోని నటనను నిరూపించుకుంది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ సినీరంగంలో పేరు సంపాదించుకుంది.
 
అయితే నటిగానే కాదు మంచి డ్యాన్సర్ సాయిపల్లవి. పెద్దగా డ్యాన్స్‌లో శిక్షణ తీసుకోకున్నా అలవాటుగా మారి తనకు డ్యాన్స్ బాగా వచ్చిందంటోంది సాయిపల్లవి. ప్రభుదేవా తనలోని డ్యాన్సర్‌ను బయట పెట్టారని.. తాను కూడా బాగా డ్యాన్స్ చేయగలనన్న నమ్మకాన్ని ప్రభుదేవా ఒక్క పాటతో కల్పించాడని ఇప్పటికీ చెబుతోంది సాయిపల్లవి.
 
తనలోని టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చే ఏ ఒక్కరినీ తాను మర్చిపోనని.. అందులో ముఖ్యుడు దర్సకుడు శేఖర్ కమ్ములని చెబుతోంది సాయిపల్లవి. నటిగానే కాదు ఒకేసారి పదిమంది వైద్యసేవలు చేయగల వైద్యురాలిని కూడా నేను. అది మర్చిపోకండి. నేను డాక్టర్ అంటూ అభిమానులతో ఖాళీ సమయాల్లో చాటింగ్ చేస్తూ తెగ ఆనందపడిపోతోందట సాయిపల్లవి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు