ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న శాకుంతలం సినిమాకు మొదట దిల్ రాజు లేడు. దాని గురించి దిల్ రాజు వివరించారు. సినిమా చరిత్రలో మన తెలుగు సినిమా ఇంతింతై వటుడింతై అనే స్టైల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్‌ను పెంచుకుంటూ వచ్చేశాం. నేను కూడా నిర్మాతగా 50 సినిమాలు చేసేశాను. తమిళంలో ఈ ఏడాది వారిసు చేశాను. అలాగే ఇక్కడ కూడా బలగం సినిమాతో సక్సెస్ కొట్టాం. నెక్ట్స్ గేమ్ చేంజర్ కూడా రాబోతుంది. ఈ మధ్యలో శాకుంతలం సినిమా వస్తుంది. నిజానికి గుణ శేఖర్‌గారు సమంతతో ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు నేను లేను. అయితే సమంత మేనేజర్ మహేంద్ వచ్చి ఇలా సినిమా అనుకుంటున్నారు సార్.. మీరు కథ వింటే బావుంటుందన్నారు. సరేనని కథ విన్నాను.