సలార్ సీజ్ పైర్ అర్థం కాకపోవడానికి కారణం అదే : శ్రియా రెడ్డి

బుధవారం, 27 డిశెంబరు 2023 (10:35 IST)
Sriya Reddy
ఇటీవలే విదులైన ప్ర‌భాస్ నటించిన సలార్ సీజ్ పైర్ సినిమాలో హింస ఎక్కువ ఉంది. సినిమా అర్థం కాలేదు అనే విమర్శలు ఉన్నాయి. అయినా సినిమా కలెక్షన్స్ ఇరగదీస్తున్నాయి. సినామీలో హింసపై ఇటీవలే పృథ్వి రాజ్ ఓ మీడియాతో మాట్లాడుతూ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాలో కంటే మించి లేదని అన్నారు. తాజాగా హైదరాబాద్ వచ్చిన శ్రియా రెడ్డి దీని పై క్లారిటీ ఇచ్చారు. 
 
హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై  ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింన ఈ సినిమా ఒరిజినల్ ఉగ్రం సినిమా చూశానని, కానీ అందులో నా తరహా పాత్ర లేదు. అందుకే చేయనని చెప్పను. హీరో ఎవరైనా పర్లేదు. నా క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఉండాలని చెప్పాను. లేదు నీ రోల్ చాలా బావుంటుంది నన్ను నమ్ము అన్నారు.
 
* రాధా రమ పాత్రను డిజైన్ చేస్తున్నప్పుడు లుక్ పరంగా చాలా డిస్కషన్స్ చేసుకున్నాం. వెండితో నా అభరణాలు చేయించారు. టాటూ కూడా ఉండాలని అనుకున్నాం. కానీ.. మళ్లీ లుక్ పూర్తి విలనీగా అనిపిస్తుంది. అలా ఉండకూడదు కదా.. అని టాటూ కూడా వద్దనుకున్నాం. సినిమా ఆసాంతం నేను, నీల్ ఎప్పుడూ గట్టిగా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్లం.
 
* గేమ్ ఆఫ్ థ్రోన్స్, కెజియఫ్, బాహుబలి సినిమాలను గమనిస్తే వాటి మొదటి భాగాలు ఎవరికీ అర్థం కావు.. సలార్ కూడా అంతే. సలార్ సీజ్ ఫైర్‌లో మేం అసలు కథేంటి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి ప్రయత్నించాం. ఇక సెకండ్ పార్ట్ చూస్తే నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంది.  దాని కోసం వెయిట్ చేయాల్సిందే. సలార్ సీజ్ ఫైర్‌లో నా పాత్ర పెద్దగా కనిపించదు. సెకండా పార్ట్‌లో ఎక్కువగా కనిపిస్తాను. సలార్ సీజ్ పైర్ ను మించేలా సెకండ్ పార్ట్ ఉంటుంది అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు