సల్మాన్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు.. అతనో డ్రగ్ అడిక్ట్

మంగళవారం, 18 అక్టోబరు 2022 (13:35 IST)
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు యోగా గురు రాందేవ్ బాబా. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. అమీర్ ఖాన్ తీసుకుంటాడో లేదో తనకైతే తెలీదు. ఇక షారుఖ్ కొడుకు డ్రగ్స్ తీసుకొని జైలుకి వెళ్ళొచ్చాడని తెలిపారు.
 
బాలీవుడ్ హీరోయిన్స్ గురించి దేవుడికే తెలియాలి. బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ గుప్పిట్లో ఉందని ఆరోపించారు. సినిమా పరిశ్రమతో పాటు రాజకీయాల్లో కూడా డ్రగ్స్ వాడకం మొదలయిందన్నారు. 
 
ఎన్నికల్లో మద్యం పంపిణి విపరీతంగా జరుగుతుందన్నారు. భారతదేశాన్ని డ్రగ్ అడిక్షన్ నుంచి విముక్తి చేయాలని. అందుకు తాము ఉద్యమం చేస్తామన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు