చెర్రీకి జోడీగా సమంత.. రంగస్థలం కాంబో రిపీట్

బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (12:27 IST)
రంగస్థలం జోడీ మళ్లీ రిపీట్ కానుంది. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో చెర్రీకూడా కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్ర నిడివి 30 నిమిషాలకు పైగా వుంటుంది. ఆ పాత్రకు హీరోయిన్ కూడా వుందని.. ఆమె ఎవరో కాదు సమంత అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
 
'రంగస్థలం' సినిమాతో చరణ్ - సమంత జంటకు మంచి క్రేజ్ పెరిగింది. అభిమానులంతా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేశారు. అందుకే మెగాస్టార్ తాజా సినిమాలోనూ చెర్రీగా జోడీగా సమంతను ఎంచుకోవాలని కొరటాల భావిస్తున్నారట. ఇక చిరంజీవి సరసన నాయికగా త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలో మొదలయ్యే రాజమండ్రి షెడ్యూల్లో త్రిష జాయిన్ కానున్నారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు