ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. సమంత 30వ సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో అభిమానులే కాక సెలబ్రిటీలు, సన్నిహితులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చైతూతో ఎంగేజ్ మెంట్ తర్వాత సమంత జరుపుకున్న తొలి బర్త్ డే ఇదే కావడం విశేషం.