గ్రామీణ సంస్కృతిని వర్ణించే సంక్రాంతి పొంగల్ సాంగ్ రిలీజ్

డీవీ

సోమవారం, 30 డిశెంబరు 2024 (17:04 IST)
Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh
గ్రామీణ సంస్కృతిని వర్ణించే గ్రాండ్ సెట్, సాంగ్ కి కలర్ ఫుల్ వైబ్‌ని యాడ్ చేస్తూ, పొంగల్ ఉత్సవాల్లో ఆడియన్స్ ని ముంచెత్తేలా పొంగల్ సాంగ్ ను నేడు సంక్రాంతికి వస్తున్నాం' నుంచి రిలీజ్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రొడక్షన్ డిజైన్‌తో కూడిన ఈ ట్రాక్ పర్ఫెక్ట్   సీజన్‌కు సరైన టోన్‌ను సెట్ చేస్తుంది.
 
భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పొంగల్ స్ఫూర్తిని క్యాప్చర్ చేసింది. వెంకటేష్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ వోకల్స్ తో అదరగొట్టారు. భీమ్స్  DJ అవతార్‌ ఆలాపనతో పాట ప్రారంభమైయింది, జనవరి చలి వాతావరణం, రంగోలీల వంటి సంక్రాంతికి ముందు జరిగే ఉత్సవాలతో సీన్ ని అద్భుతంగా సెట్ చేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్,  మీనాక్షి చౌదరి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎనర్జీగా వుంది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పండగ ప్రాముఖ్యతను, ఐక్యత, వేడుకలను అద్భుతంగా వర్ణించింది.
 
ఈ చిత్రాన్ని శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. తమ్మిరాజు ఎడిటర్, స్క్రీన్ ప్లే: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ. యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.
 
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు