రీసెంట్ గా బిహైండ్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ ఎక్సయిటింగ్ డెవలప్మెంట్ ని రివిల్ చేశారు.
మొదట్లో ఈ సినిమా స్పెషల్ ఫెస్టివల్ ట్రాక్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్‌ని తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు. అయితే వెంకటేష్ తనకు అలవాటైన చార్మ్ తో ఆ పాటను తానే పాడాలనే కోరికను వ్యక్తం చేశారు. వెంకటేష్ ఉత్సాహంగా అవకాశాన్ని కోరడం, అనిల్ రావిపూడి అంగీకరించడం వీడియోలో ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు.
'సంక్రాంతికి వస్తున్నాం'లోని ఈ వైబ్రెంట్ ఫెస్టివల్ ట్రాక్ ప్రస్తుతం RFCలో చిత్రీకరణజరుగుతోంది. ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు వైరల్ హిట్స్ గా నిలిచి ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి, ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ సాంగ్ కోసం క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ హై ఎనర్జీ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.