రీసెంట్‌గా సర్కారువారి పాట హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. శుక్రవారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఓ భారీ సెట్ వేసి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు. దీంతో పాటు కొంత టాకీ పార్టును కూడా చిత్రీకరిస్తారు. ఈ గోవా షెడ్యూల్‌లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి గోవా షెడ్యూల్ వర్కింగ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో మహేశ్, పరశురాం, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నెక్స్ట్ తీయబోయే సీన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు.
`సర్కారువారి పాట`ను పర్‌ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఆర్.మది సినిమాటోగ్రాఫర్. మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటర్, ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్. వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న సినిమాను విడుదలచేస్తున్నారు.