అక్టోబర్ 14న తీర్పు వెలువడనుంది. అప్పటి వరకు జానీ మాస్టర్ చంచల్‌గూడ సెంట్రల్ జైలులో రిమాండ్‌ను అనుభవించాల్సి ఉంటుంది. జానీకి అసిస్టెంట్‌గా పనిచేసిన 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్, అతను చాలా సంవత్సరాలుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ అతనిపై కేసు పెట్టింది.
మైనర్‌గా ఉన్నప్పటి నుంచి తనపై అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేయడంతో జానీపై పోక్సో కేసు నమోదు చేసి హైదరాబాద్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తాజాగా ఈ కేసులో బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో జాతీయ అవార్డు అందుకోవాల్సిన ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే, అతనిపై పోక్సో కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అతని అవార్డును సస్పెండ్ చేశారు. దీంతో జానీ మాస్టర్ మళ్లీ జైలుకు వెళ్లి రిమాండ్‌ను అనుభవించాల్సి వచ్చింది.