స్నేహా ఉల్లాల్ అనగానే ఐశ్వర్యా రాయ్ గుర్తుకు వచ్చేస్తుంది. ఎందుకంటే అవే మొక్కట్లతో ఇండస్ట్రీకి పరిచయమైన నటి స్నేహా ఉల్లాల్. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో తెలుగు తెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి కొంతకాలంగా తెరకు దూరమైపోయింది. ఇలా ఇండస్ట్రీకి దూరం కాగానే ఆమెది ఐరెన్ లెగ్ అనో... లేదంటే పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసిందనో వార్తలు వచ్చేస్తుంటాయి.
కానీ తాజాగా స్నేహా ఉల్లాల్ తెలియని వ్యాధితో సతమతమైనట్లు ట్వీట్ చేసింది. తనకు రక్త సంబంధిత వ్యాధి ఒకటి తగులుకుందనీ, దాని పేరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకుంది. ఈ వ్యాధి కారణంగా తను కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడలేని స్థితికి వచ్చినట్లు చెప్పింది. అందువల్ల కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరమైనట్లు చెప్పింది. ఇక ఇప్పుడు అంతా నయమైందంటున్న ఈ భామకు ఇండస్ట్రీలో చాన్సులు వస్తాయో లేదోనన్నది ప్రశ్నార్థకమే.