దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో శృంగార తారగా గుర్తింపు పొందిన నటి షకీలా. నెల్లూరుకు చెందిన ఈమె కేరళ రాష్ట్రానికి వెళ్లి స్థిరపడిపోయింది. దీంతో ఈమెను ప్రతి ఒక్కరూ కేరళ నటిగా భావిస్తుంటారు. 43 యేళ్ళ షకీలా ఇపుడు ప్రేమలోపడింది. లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతోంది. ముఖ్యంగా, తనకంటే 13 యేళ్ళ చిన్నవాడైన వ్యక్తితో పీకల్లోతు ప్రేమలోవుంది.
గత 90ల కాలంలో వెండితెరపై శృంగార పాత్రలు పోషించి అశేష ప్రేక్షకాదరణ పొందిన షకీలా.. స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీ దక్కించుకుంది. ఆమెకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగా ఉండేది. అయితే, ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోవడంతో పాటు, వ్యక్తిగత జీవితంలోను అనేక ఒడిదుడుకులు ఎదురు కావడం షకీలాని తీవ్ర సంక్షోభానికి గురిచేసింది.
ఇటీవలే ఇంద్రజిత్ లంకేష్.. షకీలా జీవితాలకు సంబంధించిన విశేషాలను సినిమాగా రూపొందించి ఐదు భాషలలో రిలీజ్ చేశాడు. షకీలా ఇప్పటికీ సింగిల్‌గానే ఉందని, ఆమెకు తోడుగా మిల్లా అనే దత్తపుత్రిక ఉంది. అయితే తాజా ఇంటర్వ్యూలో తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం వెల్లడించింది.