Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

సెల్వి

బుధవారం, 7 మే 2025 (19:32 IST)
Shobhan Babu’s Grandson
సోగ్గాడు అంటేనే శోభన్ బాబు. టాలీవుడ్ సీనియర్ నటుడు శోభన్ బాబు వ్యక్తిత్వం గొప్పది. హీరోగానే కొనసాగుతూ.. క్యారెక్టర్ ఆరిస్టుగా చేయనంటే చేయనని సినిమాలకు దూరంగా వుండిపోయారు. ఆయన వారసులు ఎవరూ సినిమా రంగానికి దూరంగా వున్నా.. వైద్య రంగంలో సోగ్గాడి మనవడు తన సత్తా చాటారు.
 
డాక్టర్ సురక్షిత్ అనే శోభన్ బాబు మనవడు.. ఓపెన్ సర్జరీ లేకుండా.. ట్రూ 3డీ ల్యాపరోస్కోపీతో 4.1 కిలోల గర్భాశయంలోని కణితిని తొలగించారు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో పెద్ద సిస్ట్ ఏర్పడడంతో.. ఆమె కొంతకాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంది.
 
ఎన్ని ఆస్పత్రులు సంప్రదించినా ఫలితం దొరకలేదు. ఓపెన్ సర్జరీ తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తేల్చేశారు. డాక్టర్ సురక్షిత్ బత్తినను సంప్రదించగా ఆయన ట్రూ 3డీ ల్యాపరోస్కోపీతో  4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. 8 గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టార్ సురక్షిత్ బత్తిన. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం సాధించారు. కాగా సురక్షిత్ బత్తిన చెన్నైలో నివసించే ప్రసిద్ధ గైనకాలజిస్ట్. అన్నా నగర్‌లోని ఇండిగో ఉమెన్స్ సెంటర్ వ్యవస్థాపకుడు.
 
డాక్టర్ బాతిన్ అధునాతన 3D లాపరోస్కోపిక్ టెక్నాలజీని ఉపయోగించి 4.5 కిలోగ్రాముల బరువున్న గర్భాశయాన్ని తొలగించే ప్రత్యేక శస్త్రచికిత్స చేశారు. ఈ శస్త్రచికిత్స ఆయన గురువు డాక్టర్ సిన్హా పేరిట ఉన్న 4.1 కిలోగ్రాముల రికార్డును బద్దలు కొట్టింది.
 
ఇప్పటివరకు, డాక్టర్ బత్తిన 10,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు చేశారు. మహిళల ఆరోగ్య సంరక్షణలో ఆయన చేసిన కృషికి 40కి పైగా అవార్డులను అందుకున్నారు. ఆయన క్లినిక్ రోగులకు గొప్ప శ్రద్ధ, భద్రతతో చికిత్స చేయడానికి ఆధునిక పద్ధతులను ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందింది. 
 
తన తాతగారి జ్ఞాపకార్థం ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా ఆయన సమాజానికి సేవ చేస్తున్నారు. కుటుంబ సేవా స్ఫూర్తిని కొత్త మార్గంలో సజీవంగా ఉంచుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు