సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కాంబినేషన్లో తెలుసు కదా చిత్రం ప్రారంభం
బుధవారం, 18 అక్టోబరు 2023 (17:05 IST)
telusukada movie- clap by nani
సిద్దు జొన్నలగడ్డ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 30ని అనౌన్స్ చేసింది. 'తెలుసు కదా' అనే టైటిల్‌తో, సోల్‌ఫుల్ లవ్ స్టొరీ గా రూపొందనున్న ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. గ్రాండ్ టైటిల్ గ్లింప్స్‌తోఅందరినీ ఆకట్టుకున్నారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
ఈరోజు హైదరాబాద్‌లో కోర్ టీమ్, పలువురు అతిథుల సమక్షంలో ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నేచురల్ స్టార్ నాని ముహూర్తం షాట్‌కి క్లాప్ ఇవ్వగా, హీరోలు నితిన్, ఆది పినిశెట్టి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఆది, నందిని రెడ్డి, కోన వెంకట్, వక్కంతం వంశీ, బొమ్మరిల్లు భాస్కర్, మల్లిక్ రామ్, సితార నాగ వంశీ, నిర్మాత విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
స్టార్ కంపోజర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ డీవోపీ యువరాజ్ జె ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అర్చనరావు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.
మరికొద్ది వారాల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.