చిత్ర నాయకా, నాయికపై చిత్రీకరించిన ముహూర్తపు దశ్యానికి హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకష్ణ (చినబాబు) పెద్ద కుమార్తె హారిక క్లాప్ నివ్వగా, చిన్న కుమార్తె హాసిని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకష్ణ (చినబాబు) చిత్ర దర్శక, నిర్మాతకు స్క్రిప్ట్‌ను అందచేశారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యుర్ షూటింగ్ ఫిబ్రవరి 4నుంచి ప్రారంభం అవుతుంది. కొత్తతరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిదని తెలిపారు దర్శకుడు విమల్‌కష్ణ. చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాు, వివరాు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి. ఇతర ప్రధాన పాత్రలో ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ ఇప్పటివరకు ఎంపికైన తారాగణం. ఈ చిత్రానికి రచన: విమల్ కష్ణ, సిద్దు జొన్నగడ్డ, మాటు: సిద్దు జొన్నగడ్డ, సంగీతం: కాభైరవ, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని.