60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్న శింబు.. ఆదిక్‌ రవిచంద్రన్‌ డైరక్షన్‌లో....

సోమవారం, 26 సెప్టెంబరు 2016 (10:31 IST)
బీప్ సాంగ్‌తో మహిళలను కించపరిచాడంటూ వివాదంలో చిక్కుకున్న కోలీవుడ్ నటుడు శిలంబరసన్ గత కొంత కాలంగా సినిమా సంబంధంగాను, ప్రేమ వ్యవహారాల్లోను పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శింబు ''వాలు'', ''ఇదునమ్మ ఆళు'' వంటి సినిమాలతో ప్రేమ, హాస్యం ట్రాక్‌లో వెళ్తున్న ఆయన ఇప్పుడు ''అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్'' సినిమాలో మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. తండ్రి, ఇద్దరు కుమారులుగా నటిస్తుండడం విశేషం. ఇద్దరు కుమారులది యువకుల పాత్రే. 
 
అందులో ఒకటి మదురై మైఖేల్‌.. చాలా రఫ్‌ క్యారెక్టర్‌ను పోషించినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోటి చాలా సున్నితంగా వ్యవహరించే పాత్ర అని సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో శింబు 60 ఏళ్ల వృద్ధుడిగా కీలకపాత్ర పోషించినట్లు దర్శకుడు ఆదిక్‌ రవిచంద్రన్‌ తెలిపారు. ఈ పాత్ర కోసం శింబు తనను తాను పూర్తిస్థాయిలో మలచుకుంటున్నారని, అందుకు తగ్గట్టు సిద్ధమవుతున్నారని చెప్పారు.
 
ఈ పాత్ర కోసం శింబు లావుగా మారుతున్నట్లు కూడా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ అందగాడు పాత్రల్లో అలరించే తమ హీరో 60 ఏళ్ల వృద్ధుడిగా ఎలా నటించడంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా గౌతంమేనన్‌ దర్శకత్వంలో శింబు నటించిన ''అచ్చం ఎన్బదు మడమైయడా'' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి