ఇపుడు సహజీవనం తప్పే లేదు : సింగర్ దామిని భట్ల

సోమవారం, 2 అక్టోబరు 2023 (19:31 IST)
తాను ముందు సహజీవనం చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటామని ప్రముఖ సింగర్ దామిని భట్ల స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ, తనకు ప్రేమ వివాహం అంటేనే ఇష్టమన్నారు. ఇందుకోసం ముందుగా సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామని తెలిపింది. ఇప్పటి రోజుల్లో సహజీవనం తప్పే లేదని స్పష్టం చేశారు. 
 
పైగా, ఈ విషయంలో తనను తన తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుంటారని తెలిపింది. వాళ్ల అనుమతి తీసుకున్న తర్వాతే తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని చెప్పారు. అయితే, తనకు నచ్చిన వ్యక్తి ఇంకా తారసపడలేదని, అందుకే తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పారు.
 
కాగా, సింగర్ దామిని ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఏడు కోసం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. తమ ఇంట్లోకి చికెన్ కూడా తీసుకురారని, అలాంటిది బిగ్ బాస్ హౌస్‌లో తాను చికెన్ కర్రీ వండానని చెప్పింది. తాను పూర్తి వెజిటేరియన్ అని, అయితే గుడ్డు మాత్రం తింటానని తెలిపింది. ఇప్పటివరకు తన ఒంటిపై ఒక్క టాటూ కూడా లేదని... తనకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి టాటూ వేయించుకుంటానని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు