దక్షిణాది సెక్సీ తార సిల్క్ స్మిత గురించి కొన్ని విశేషాలు

శనివారం, 23 సెప్టెంబరు 2023 (16:39 IST)
సిల్క్ స్మిత అంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే పేరుంది. ఆమె సెప్టెంబరు 23, 1996లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె చనిపోయి 27 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఆమె జ్ఞాపకాలను సినీప్రియులు గుర్తుచేసుకుంటున్నారు. 
 
ఈ సందర్భంగా సిల్క్ స్మిత గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి, ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో జన్మించారు.
 
స్మిత కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో 4వ తరగతి వద్దే చదువు ఆపేసారు.
 
స్మిత అందంగా వుండటంతో ఆమెను పెళ్లాడుతామంటూ చాలామంది వెంటపడేవారు.
 
ఫలితంగా తల్లిదండ్రులు ఆమెకి చిన్నతనంలోనే పెళ్లి చేసేసారు.
 
ఐతే భర్త, అత్తమామలు సాధింపు కారణంగా స్మిత ఇంటి నుంచి పారిపోయారు.
 
టచ్ అప్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలుపెట్టి క్రమంగా హీరోయిన్ స్థాయికి ఎదిగారు.
 
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా మొత్తం 450 చిత్రాల్లో నటించారు.
 

27 years ago, on this day in 1996,#SilkSmitha passed away..

She is still an iconic personality in Tamil/South Cinema..

The response for her scene in the recently released #MarkAntony is unbelievable..pic.twitter.com/t0o9RL95xH

— Ramesh Bala (@rameshlaus) September 23, 2023
1996 సెప్టెంబరు 23న ఆమె ఆత్మహత్య చేసుకున్నారు, ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది.

Rare video of #SilkSmitha#MarkAnthony pic.twitter.com/G5N0Estbwu

— Cine Promoters (@cinepromoters) September 18, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు