ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కోవిడ్ నెగటివ్ రాలేదు, పుకార్లు పుట్టించొద్దు

సోమవారం, 24 ఆగస్టు 2020 (13:10 IST)
ప్రముఖ సింగర్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. కోవిడ్ నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారంటూ వస్తున్న వార్తలను ఎస్పీబి తనయుడు చరణ్ ఖండించారు. విదేశీ వైద్య నిపుణులు అందిస్తున్న సూచనల మేరకు ఎస్పీబీకి చికిత్సలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసర చికిత్సా విభాగంలో వెంటిలేటర్, ఎక్మో పరికరంతో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. 
 
బాలు కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన కోలుకోవాలని సెలబ్రెటీలు, సంగీత ప్రేమికులు దేవుడిని ప్రార్దిస్తూనే ఉన్నారు. ఈ నెల 19న బాలుకు వైద్యులు ఎక్మొ చికిత్స చేశారు. విదేశాల నుంచి సుమారు 15 మంది వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు