సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ గురువారం రిలీజైంది. ఈ సినిమా టీజర్‌ను బుధవారమే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు బాధలో ఉండటంతో టీజర్ రిలీజ్ను చిత్రయూనిట్ వాయిదా వేశారు.
కాగా.. టాగూర్ మధు సమర్పణలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మితమవుతున్న 'స్పైడర్' టీజర్ విడుదలైన కొద్ది సేపటికే నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి గ్రాఫిక్స్, సీజీ ప్రధానంగా చిత్రం ఉన్నట్టు టీజర్‌ను చూస్తేనే తెలిసిపోతుంది. ఓ బాక్స్ రోబో స్పైడర్‌గా రూపాంతరం చెంది నెమ్మదిగా పాకుతూ, మహేష్ బాబు కాలుపైకి ఎక్కడంతో టీజర్ ప్రారంభమవుతుంది.