అయితే తాజాగా శ్రీరెడ్డి రొటీన్ కు భిన్నంగా తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తమిళ యూట్యూబ్ యాంకర్‌తో శ్రీరెడ్డి సరదాగా సంభాషించారు. యూట్యూబ్ యాంకర్ శ్రీరెడ్డికి ఒక ఛాలెంజ్ ఇవ్వగా ఆ ఛాలెంజ్‌ను శ్రీరెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. రోడ్డుపైన వాహనాలను ఆపి ఫోన్ నంబర్ తీసుకొని రావాలని యాంకర్ శ్రీరెడ్డికి ఛాలెంజ్ ఇచ్చారు తమిళ యాంకర్.
ఆ తర్వాత రోడ్డుపై వస్తున్న వాహనాలను ఆపుతూ శ్రీరెడ్డి ఫోన్ నంబర్లను అడిగింది. ఈ వీడియోకు 80,000 కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. శ్రీరెడ్డి ఫోన్ నంబర్లు అడగగా కొంతమంది ఆమె అడిగిన వెంటనే ఫోన్ నంబర్లు ఇచ్చారు. మరి కొందరు మాత్రం ఆమె ఫోన్ నెంబర్ అడగటంతో ఆమె షాకైంది.