దేవుడు చేసిన మ‌నిషి, మహాకవి శ్రీ‌శ్రీ‌

శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:43 IST)
Sri sri
శ్రీ‌శ్రీ ఇది రెండక్ష‌రాల పేరు. ఒక‌వైపు అభ్యుద‌య సాహిత్యంతోపాటు అభ్యుద‌య సినిమా గీతాలు రాసి ఆక‌ట్టుకున్న క‌వి, ర‌చ‌యిత‌, మేథావి శ్రీ‌రంగం శ్రీ‌నివాస‌రావు. 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పటకొండ దంపతులకు జన్మించాడు. నేడు ఆయ‌న జ‌యంతి. ఈ సంద‌ర్భంగా వెబ్‌దునియా ఆయ‌న గురించి చెబుతున్న కొన్ని సంగ‌తులు.
 
ఆయన పాటల్లో సగటు మనిషి ఆవేదన ఉంటుంది. వారి బాధలను పోగోట్టే ఆనందం ఉంటుంది. విప్లవ గీతాలైనా, భావాత్మక గీతాలైనా.. దేశభక్తి గీతాలైనా, ప్రణయ గీతాలైనా, విరహగీతాలైనా, విషాద గీతాలైనా, భక్తి గీతాలైనా ఆయన కలం నుంచి అలవోకగా జాలువారుతాయి. తెలుగు పాటకు కావ్య గౌరవం కల్పించిన మహాకవి. తెలుగు పాటకు తొలిసారి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిన మహనీయుడు. ఎన్‌.టిఆర్‌. న‌టించిన దేవుడు చేసిన మ‌నుషులు చిత్రంలో.. దేవుడు చేసిన మ‌నుషుల్లారా మ‌నుషులు చేసిన దేవుళ్లారా వినండి ఈగోల‌. అంటూ సందర్భానుసారంగా ఆహా అపినించేలా రాసిన క‌వి.
 
Sri sri- maha prastanam
శ్రీ‌శ్రీ క‌లంనుంచి జాలువారిన ఏ ప‌ద‌మైనా ప‌రుగులు పెడుతుంది. ఉత్సాహాన్నిస్తుంది. ఉద్రేకాన్ని క‌లిగిస్తుంది. ఆలోచింప‌జేస్తుంది. పాట‌లో త‌న్మ‌యాత్వానికి గురిచేస్తుంది. ఈటెల లాంటి ప‌దాల‌తో సూదుల్లా గుచ్చుకునేట్లు చేస్తుంది. అది ఆయ‌న శైలి. సంస్కృతం బాగా తెలిసిన, చ‌దివిన శ్రీ‌శ్రీగారు న‌న్న‌య్య గారి స్పూర్తిగా తీసుకున్నార‌న‌డంలో సందేహం లేదు. ఒకానొక స‌మ‌యంలో న‌న్న‌య్య త‌ను రాస్తున్న గ్రంథాన్ని పూర్తిచేసే క్ర‌మంలో కొన్ని అడ్డంకులు వ‌స్తుండ‌గా.. రానీ రానీ వ‌స్తేరానీ క‌ష్టాల్‌.. న‌ష్టాల్‌, అంటూ దేవుడిని ఆయ‌న ప్ర‌శ్నించిన తీరును గుర్తుచేసుకుంటూ.. మ‌హాప్ర‌స్తానంలో శ్రీ‌శ్రీ‌గారి ప‌లికిన తూటాలాంటి ప‌దాలతో పామ‌రుల‌ను సైతం ఆక‌ట్టుకున్నాడు.
 
- రానీ రానీ వ‌స్తే రానీ క‌ష్టాల్‌, న‌ష్టాల్ కోపాల్ తాపాల్‌, రానీ వ‌స్తేరానీ, అంటూ.. ప‌లికారు. ఇది ఆయ‌న ఓ సాహిత్య‌వేదిక‌లో ఓ పండితుడు న‌న్న‌య్య ప‌దాల‌ను గుర్తు చేస్తే. ఆయ‌న స‌మాధానంగా ఈ పాట వినిపించారు. ఇలా అప్ప‌టి త‌రం సాహిత్య వేత్త‌ల‌కు సంస్కృత‌మే ఆయువుప‌ట్టు. దాన్ని బాగా అవసోస‌న ప‌ట్టిన శ్రీ‌శ్రీ‌గారు, స‌మ‌కాలీన సాహిత్య‌వేత్త‌లు కాస్త గ్రాంధికంగా సాహిత్యాన్ని రాస్తుంటే త‌ను పామ‌రుడికి అర్థ‌మ‌య్యేలా రాసి అభ్యుద‌య క‌విగా పేరు తెచ్చుకున్నాడు. 
 
- సినీ క‌విగా ఆద‌రిస్తారో లేదో అన్న మీమాసంలో వుండ‌గానే ఆయ‌న‌కు అవ‌కాశాలు రావ‌డం కొన్ని ప‌రిమితుల‌కు లోబ‌డి ఆయ‌న రాయ‌డం జ‌రిగింది. పేమెంట్ త‌క్కువైనా పొట్ట‌కూటి కోసం కొన్ని రాయాల్సి వ‌చ్చింది. అందుకే `మ‌న‌సున మ‌న‌సై, బ‌తుకున బ‌తుకై తోడొక‌రుంటే అదే భాగ్యం..` అంటూ ఆలుమ‌గ‌ల జీవితాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. స‌మ స‌మాజాన్ని ఆయ‌న చూసిన కోణం మ‌రెవ‌రూ చూడ‌లేదు. ఒక‌వేళ చూసినా పామ‌రుల కోణంలో ఆయ‌న చూసినంత‌గా ఎవ్వ‌రూ చూడ‌లేద‌నే చెప్పాలి.
 
- బ్రాహ్మ‌ణుడైనా త‌న కులంవారి మ‌డి ఆచారాల‌పై ప‌లుసార్లు ఎక్కుపెట్టిన ప‌దాలూ వున్నాయి. `ఐ` అనే పుస్త‌కంలో.. భూతాన్ని య‌జ్ఞోపవీతాన్ని వైప్ల‌వ్య గీతాన్ని నేను, స్మ‌రిస్తే ప‌ద్యం, అరిస్తే నాదం.. అంటూ తేల్చిచెప్పారు. `నేను సైతం`లో నేను సైతం ప్ర‌పంచానికి స‌మిధి నొక్క‌టి ఆహుతినిచ్చాను.. అంటూ అరిచారు. ఆయ‌న పాట‌ను స్పూర్తిగా తీసుకున్న సుద్దాల అశోక్ తేజ‌కు నేను సైతం అనే పాట‌ను రాసినందుకు జాతీయ స్థాయిలో అవార్డు ద‌క్కింది. ఇదంతా శ్రీ‌శ్రీ పుణ్య‌మే అంటూ ఆయ‌న వాడిన ప‌దాల‌ను నేను స్పూర్తిగా తీసుకున్నాన‌నంటూ వెల్ల‌డించారు.
 
srisri
- ఒక‌టా రెండా ఎన్నో సాహిత్య ప‌దాలు ఆయ‌న నుంచి జాలువారాయి. దేశ చ‌రిత్ర‌లు గురించి చెబుతూ.. ఏ దేశ చ‌రిత్ర చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం. న‌ర‌జాతి చరిత్ర స‌మ‌స్తం ప‌ర‌పీడ‌న ప‌రాయ‌ణ‌త్వం .అంటూ తేట‌తెల్లం చేశారు.
 
- అదేవిధంగా మ‌నిషి గ‌ర్వానికి, పొగ‌రుకు కార‌ణాన్ని విడ‌మ‌ర్చి చెబుతూ..  ఏ తీవ్ర శ‌క్తులో న‌డిపిస్తే న‌డిచే మ‌నుషులు.. అంతా త‌మ ప్ర‌యోజ‌క‌త్వం తామే భువి క‌థినాధుల‌మ‌ని విర్ర‌వీగే ఈ మ‌నుషులు.. స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన క‌ట్ట‌డాలు ఇత‌రేత‌ర శ‌క్తులు లేస్తే ప‌డిపోయెను పేక‌మ‌యేడ‌లై.. అంటూ చుర‌క వేశారు.
 
- ఏ యుద్ధం ఎందుకు జ‌రిగిందో, ఈ రాణీ ప్రేమ పురాణం, ఆ ముట్ట‌డికైనా ఖ‌ర్చులూ ఇవి కావోయ్ చ‌రిత్ర అంటే.. తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వ‌రూ అంటూ చ‌రిత్ర కారుల్ని ప్ర‌శ్నించారు. ప‌తితులారా భ్ర‌ష్టులారా.. వ‌స్తున్నాయ్ వ‌స్తున్నాయ్ జ‌గ‌న్నాథ ర‌థ‌చ‌క్రాల్‌.. అంటూ నీరుగారిన యువ‌త‌ను చైత‌న్య ప‌రిచారు.
 
- ‘అల్లూరి సీతారామరాజు’లో చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాట తెలుగు సినీ పాటల్లో ఆణిముత్యంలా నిలిచిపోయింది. ఈ మూవీలోని ఈ గీతానికే తొలిసారి తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఇలా తెలుగు సినీ పాటకు తన రచనతో గౌరవం దక్కేలా చేసారు శ్రీశ్రీ.
 
- మ‌రోవైపు పాల‌కుల‌పైనా ఎక్కుపెట్టారు.. `ఎం.ఎల్‌.ఎ.` అనే క‌విత‌లో... చూడు చూడు ఎం.ఎల్‌.ఎ. పాలించే పార్టీలో ప్రాబ‌ల్యం వుంది. అత‌డు నందంటే నందే అది ప‌దంటే పందే మ‌రి.. అంటూ సెటైర్ వేశారు.
 
- ఇలా తెలుగులో ఒక్కో అక్ష‌రంతో ఒక్కో ప‌ద్య గ్రంథం రాసిన ఘ‌న‌త శ్రీ‌శ్రీ‌కే ద‌క్కుతుంది. 
అందుకే సాహిత్య‌వేత్త‌లు అంటుంటారు.. కృష్ణ‌శాస్త్రి బాధ లోకానికి బాధ‌. లోకం బాధ శ్రీ‌శ్రీ బాధ‌ అని చెప్పారు. ప్రాస‌ల‌కు అర్థ‌వంత‌మైన ప్రాస‌లిస్తూ.... ముగ్గుబుట్ట‌లాంటి త‌ల ముడ‌త‌ప‌డిన దేహంతో ఊరి చివ‌ర కూర్చున్న‌దో ఓ ముదుస‌లి.. అంటూ ముదుస‌లి బ‌తుకును సైతం క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన వ్య‌క్తి శ్రీ‌శ్రీ‌.
 
- ఆయ‌నే లేక‌పోతే క‌విత్వం ఏమైపోతుంది అనుకునే వారంతా ఆయ‌న్నూ ఆనుస‌రిస్తూ పాటలు రాస్తున్న సీనీ క‌వులు నేడు తెలుగు రంగంలోనూ వున్నారు. కానీ శ్రీ‌శ్రీ శ్రీ‌శ్రీ‌యే. అందుకే ఆయ‌న్ను మ‌హా క‌వి అన్నారు. ఆయ‌న‌కివే నీరాజ‌నాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు