ఈ చిత్రం సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించనున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఒంగోలులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని కీలక పాత్రల్లో నటించారు. స్టార్ టెక్నిషియన్స్ ఈ సినిమాని పని చేస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ కాగా రధన్ సంగీతం సమకూరుస్తారు. ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.