అతిలోక సుందరి శ్రీదేవి మృతి పట్ల ఫోరెన్సిక్ రిపోర్ట్ విడుదలైంది. అయితే ఆ నివేదిక పలు అనుమానాలకు తావిస్తోంది. దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లోని బాత్ టబ్‌లో మునిగి మరణించిందని ఫోరెన్సిక్ నివేదికలో యూఏఈ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఫోరెన్సిక్ నివేదిక స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. Accidental ''DRAWINING'' అని పడింది. drowning అని పడాల్సిందని.. వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా అధికారిక నివేదికేనా లేక ఎవరైనా సృష్టించి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
శ్రీదేవి గుండెపోటుతో మరణించిందని సంజయ్ కపూర్ స్పష్టం చేస్తే.. ఆ విషయం పోస్టుమార్టం రిపోర్టులో లేకపోవడం కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. యూఏఈ ఆరోగ్య శాఖ శ్రీదేవి మృతిపై ప్రకటన చేసిన అనంతరం దుబాయ్ పోలీసులు ఈ కేసు విచారణను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. మరోవైపు శ్రీదేవి భౌతికకాయం భారత్ రావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటివరకు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చినా.. ఇవన్నీ ప్రాథమిక అంశాలేనని పూర్తి స్థాయి నివేదిక అందాలని న్యాయ నిపుణులు అంటున్నారు. కొత్త సందేహాలను రేకెత్తిస్తున్న ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై సోషల్ మీడియా రచ్చ మొదలైంది. శ్రీదేవి మృతిపై పలు అనుమానాలున్నాయని దుబాయ్ మీడియా కూడా కథనాలు ప్రసారం చేస్తోంది. ఫిబ్రవరి 20న మేనల్లుడి వివాహానికి భర్త బోనీ కపూర్‌తో శ్రీదేవి హాజరైంది.
23న దుబాయ్ వివాహ వేడుకలో బోనీ, శ్రీదేవి డ్యాన్స్ చేసి సందడి చేశారు. రిసెప్షన్ తర్వాత భారత్‌కు వచ్చిన బోనీ కపూర్.. 21, 22న హోటల్ నుంచి బయటకు రాని శ్రీదేవికి ఏమైంది..? ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇంకా భారత్‌కు వచ్చిన బోనీ తిరిగి దుబాయ్ ఎందుకెళ్ళారు? శ్రీదేవి ఆల్కహాల్ ఎక్కువ కావడం వల్లే మృతి చెందిందా? లేక ఇతర కారణాలు ఏమైనా వున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా దుబాయ్ మీడియా బోనీ కపూర్ శ్రీదేవికి ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నాయి.