బాహుబలిలో శివగామి కోసం కోట్లు అడిగానా? జక్కన్న మాటలు విని షాక్ అయ్యా: శ్రీదేవి
శుక్రవారం, 30 జూన్ 2017 (15:04 IST)
బాహుబలిలో శివగామి కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్న రాజమౌళి.. ఆమెను సంప్రదించాడని, ఆమె పారితోషికం భారీగా అడగడంతో కుదరలేదని.. జక్కన్న రమ్యకృష్ణను ఆ రోల్‌కు ఎంపిక చేశారు. అయితే బాహుబలి సినిమా రిలీజ్ అయ్యాక ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ పాత్రలో శ్రీదేవిని తీసుకుంటే క్లిక్ అయ్యేది కాదని.. తమ అదృష్టం బాగుండి ఆమెను సినిమా చేసేందుకు ఒప్పుకోలేదన్నారు.
అయితే జక్కన్న వ్యాఖ్యలకు సంబంధించిన లింకును శ్రీదేవికి ఆమె సన్నిహితులు పంపారట. ఆ లింకులో రాజమౌళి శ్రీదేవి గురించి చేసిన కామెంట్స్ పట్ల అతిలోకసుందరి కూల్‌గా స్పందించింది. మామ్ మూమీ ప్రమోషన్లో భాగంగా శ్రీదేవి మాట్లాడుతూ.. జక్కన్న కామెంట్స్ చూసి షాక్ అయ్యాను. ఆయన మాటలు తననెంతో బాధించాయని.. రాజమౌళి అంటే తనకెంతో గౌరవమని చెప్పుకొచ్చింది.
ఈగ సినిమా అద్భుతంగా ఉందని, తనకెంతో నచ్చిందని చెప్పిన శ్రీదేవి, జక్కన్న బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పద్దతిగా అనిపించలేదని, మనసుకు బాధ కలిగించిందని చెప్పింది. రెమ్యునరేషన్‌పై తాను అలా మాట్లాడలేదని శ్రీదేవి కామెంట్ చేశారు. బాహుబలి పార్ట్ 1, 2లు రిలీజైనా.. ఇంకా శివగామి గురించి మాట్లాడటం ఇష్టపడలేదని ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి తెలిపింది.
కొన్ని కారణాల వల్ల గతంలో చాలా సినిమాలు తాను చేయలేకపోయానని.. అలాంటి సినిమాలు ఎన్నో బంపర్ హిట్ అయిన సందర్భాలు తన కెరీర్‌లో వున్నట్లు శ్రీదేవి అన్నారు. కానీ ఆ సినిమాల్లో తాను నటించలేదని.. దర్శకులు కానీ, తాను కానీ మాట్లాడిన సందర్భాలు లేవన్నారు. కానీ బాహుబలిలో నటించకపోయేసరికి ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. తాను భారీ మొత్తాన్ని అన్యాయంగా డిమాండ్ చేసే పనైతే 50 సంవత్సరాల పాటు 300 సినిమాలు చేసేదాన్ని కాదని.. ఎందరో నిర్మాతలతో పనిచేసివుండేదాన్ని కాదని చెప్పారు.
భారీ మొత్తం తాను అడగలేదని, ఫ్లైట్ టిక్కెట్లు, హోటల్ మొత్తం రిజర్వ్ చేయమన్నానని, రూ. పదికోట్లు అడిగానని వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీదేవి చెప్పుకొచ్చారు. ఒకవేళ రాజమౌళికి నిర్మాత తాను భారీగా డిమాండ్ చేసినట్లు.. తప్పుగా చెప్పివుండవచ్చునేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త కూడా ఓ నిర్మాత అని, బోనీ కపూర్ కూడా నిర్మాత పడే కష్టాలను గుర్తిస్తారని బాహుబలి కోసం భారీ మొత్తాన్ని ఆయన కూడా డిమాండ్ చేసి వుండరని శ్రీదేవి చెప్పారు. రాఘవేంద్రరావు, అశ్వనీదత్ వంటి దర్శకులతో ఎన్నో సినిమాలు చేశానని గుర్తు చేశారు.
కానీ పబ్లిక్‌గా రాజమౌళి ఇలా మాట్లాడటం పద్ధతి కాదని తెలిపారు. అయినా రాజమౌళితో పనిచేసేందుకు తాను ఇష్టపడతానని, అంత డిమాండ్ చేసే పనైతే తానెందుకు ఇక్కడుంటానని శ్రీదేవి చెప్పారు. అయినా రాజమౌళిని విష్ చేస్తున్నానని.. బాహుబలి లాంటి గొప్ప సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు శ్రీదేవి వెల్లడించారు.