బిగ్ బాస్... వీళ్ల ఏడుపు నేను చూడలేక చస్తున్నా, ప్లీజ్ ఎలిమినేట్ దెమ్... ఎవరూ?

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (18:53 IST)
బిగ్ బాస్ 3 గేమ్ షోలో మూడవ సీజన్‌కు సంబంధించి మరొక ఎలిమినేషన్ జరుగబోతోంది. అయితే ఎలిమినేషన్ కాబోయే వారిలో ప్రముఖంగా శ్రీముఖి పేరే వినబడుతోంది. అంతేకాదు శిల్పా చక్రవర్తి, హిమజ, పునర్నవి, మహేష్ కూడా వీరిలో ఉన్నారు.
 
కానీ వీరిలో శ్రీముఖి వెళ్ళిపోవడం ఖాయమట. ఎలా అంటే... ఇప్పటికే రాహుల్‌ను శ్రీముఖి టార్గెట్ చేస్తోంది. అయితే గతవారం మాత్రం అతన్ని వదిలేసింది. కానీ రాహుల్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 
 
దీంతో శ్రీముఖి ఎలిమినేట్ అయిపోవడం ఖాయమని తెలుస్తోంది. అంతేకాదు శిల్పా చక్రవర్తి కూడా హౌస్‌లో చీటికి మాటికి కంటతడి పెడుతూ ఉంది. దీంతో ఆమెను కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి బాస్ ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నాడో..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు