స్టార్ మా బిగ్ బాస్ షో కోసం భారీగా ఖర్చు చేస్తుంది. కోట్లు ఖర్చుపెట్టి అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద హౌస్ సెట్ వేస్తారు. ఇక కంటెస్టెంట్స్, హోస్ట్ రెమ్యూనరేషన్ రూపంలో భారీగా చెల్లిస్తుంది. అలాగే మిగతా ఈవెంట్స్ పక్కన పెట్టి ప్రైమ్ టైంలో ప్రసారం చేస్తున్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా దారుణమైన టీఆర్పీ రాబడుతుంది. కనీసం సీరియల్స్‌తో కూడా పోటీపడలేకపోతుంది.
బిగ్ బాస్ ఎపిసోడ్స్ కి కేవలం 2 నుండి 2.5 రేటింగ్ మాత్రమే వస్తుందట. వీకెండ్ ఎపిసోడ్స్‌కు కూడా ఇదే పరిస్థితి. వీకెండ్స్ లో బిగ్ బాస్ 6 రేటింగ్ 3 నుండి 3.5 గా ఉంటుందట. కొన్ని పాప్యులర్ సీరియల్స్ 10 టీఆర్పీ ఈజీగా తెచ్చుకుంటుంటే… బిగ్ బాస్ దారుణంగా కనీసం అందులో సగం రాబట్టలేకపోతుంది. అందుకే ఈ షోను ఆపేయాలని నిర్వాహకులు అనుకుంటున్నారని తెలిసింది.
మొత్తానికి బిగ్ బాస్ 6 మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఇకపోతే.. 21 మంది కంటెస్టెంట్స్‌తో షో మొదలైంది. రెండవ వారం షాని, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. మూడవ వారం నేహా చౌదరి హౌస్ నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం హౌస్‌లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.