బుల్లి తెర ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. గాలోడు చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కాలింగ్ సహస్త్ర. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది.
టీవీ షోస్‌లో నవ్వించిన సుధీర్ , గాలోడు చిత్రంలో మాస్ హీరోగా ఆకట్టుకున్నారు. అయితే ఈసారి మరో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ నిర్మాతలుగా కాలింగ్ సహస్త్ర మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ. డైరెక్టర్ అరుణ్, హీరో సుధీర్, హీరోయిణ్ డాలీషా సపోర్ట్‌తో సినిమాను పూర్తి చేశాం. ఔట్ పుట్ సూపర్‌గా వచ్చింది. సరికొత్త సుధీర్‌ను చూస్తారని నమ్మకంగా చెబుతున్నాను. ఇందులో సుధీర్ పాత్రను వెండి తెరపై చూసిన ఆడియెన్స్ వామ్మో సుధీర్ ఇలాంటి పాత్రలో కూడా నటిస్తారా అనేంత వైల్డ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో, మాసీగా ఉంటుంది. ప్రేక్షకులు ఊహించని మలుపులతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనుంది మా కాలింగ్ సహస్త్ర మూవీ. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.