హీరో సుమంత్ తాజా చిత్రం మళ్ళీ మొదలైంది. టి.జి.కీర్తి కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో వెడ్డింగ్ కార్డ్ లీక్ కావడంతో మూవీ లవర్స్ అందరిలో ఓ అటెన్షన్ క్రియేట్ అయ్యింది. తర్వాత సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సుహాసిని, వెన్నెల కిషోర్ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం హీరో సుమంత్ క్యారెక్టర్ రివీలింగ్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.